సకాలంలో వైద్యమందక హుకుంపేట మండలంలోని తీగలవలస పంచాయతీకి చెందిన పనసబంధ గ్రామానికి చెందిన వంతల. నాగేశ్వరావు భాను దంపతులకు జన్మించిన నవజాత శిశువు మృతి చెందిందని హుకుంపేట మండల వైస్ ఎంపీపీ సూడిపల్లి. కొండలరావు హెచ్ఆర్సీఏ జిల్లా కోఆర్డినేటర్ తాపుల. కృష్ణారావు ఆరోపించారు. బుధవారం ఉదయం ఓ ప్రకటనలో భాగంగా వారు మాట్లాడుతూ. పనసబంధ గ్రామస్తులు 108 అంబులెన్స్ కు ఎన్నో సార్లు ఫోన్లు చేసిన సమయానికి అంబులెన్స్ పనసబంధ గ్రామానికి వెళ్లకపోవడంతో గ్రామస్తులు గర్భిణికి డోలి కట్టి డోలిమోత సహాయంతో ఆస్పత్రికి చేరుస్తుండంతో మార్గమధ్యంలో భానుకు ప్రసవ నొప్పులు అధికమయ్యి బిడ్డ అడ్డం తిరగడంతో బాను మృతి చెందిన శిశువుకి జన్మనిచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో అంబులెన్స్ పనసబంధ గ్రామానికి వెళ్లి ఉంటే ఆ శిశువు మృతి చెందేదే కాదని ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్లు సకాలంలో ఆయా గ్రామాల్లో వెళ్లకపోవడంతో విలువైన ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.