ముఖంపై మొటిమలు పోవాలంటే ఓ టొమాటోను గుజ్జుగా చేసి దానిలో 2 చెంచాల కీరదోస రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరవాత కడిగేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే మొటిమలు తగ్గుతాయి.
సమ్మర్ లో చర్మం కమిలిపోయినట్లు కనిపిస్తే 2 చెంచాల టొమాటో రసంలో 4 చెంచాల మజ్జిగ, చెంచా పెసర పిండి, కొంచెం తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మర్దన చేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయాక ముఖం కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే సమస్య పోతుంది.