అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం దక్కింది. ఇటీవల అన్నాడీఎంకే సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికయిన సంగతి తెలిసిందే. పళనిస్వామి ఎన్నిక సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించింది. అన్నాడీఎంకే తాతాల్కిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగేందుకు ఈపీఎస్‌కు లైన్ క్లియర్ అయింది. దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వం అమలులోకి వచ్చింది. పార్టీ తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామిని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ నిర్ణయాన్ని పన్నీరు సెల్వం సవాల్ చేశారు.