ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 39 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజుల నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి.