కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు కొలువైన ఆధ్యాత్మిక నగరం ‘తిరుపతి’. రామానుజచార్యులు కొండ కింద గోవింద రాజస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో తిరుపతి చరిత్రకు బీజం పడింది. క్రీ.శ.1130లో ఫిబ్రవరి 24న ఆవిర్భవించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం తిరుపతి నగరం 893వ పుట్టినరోజు జరుపుకోనుంది. ఈ క్రమంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.