బీట్‌రూట్.. ఎన్నో లాభాలనిచ్చే ఈ వెజిటేబుల్ స్పోర్ట్స్ పర్సన్స్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. వారి పెర్ఫామెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందుకోసం బీట్‌రూట్‌ని ఎలా తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. స్పోర్ట్స్ పర్సన్స్‌కి ఇది ఎలా ఉపయోగపడుతుంది. బీట్‌రూట్ తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటి. ఎలా తీసుకోవాలి. దీని వల్ల నిజంగానే ఆటలు ఆడే పనితీరు మెరుగ్గా మారుతుందా.. ఇలాంటి వివరాలన్నీ ఈ ఆర్టికల్‌లో పూర్తిగా తెలుసుకోండి.
ఏరోబిక్స్ చేసేవారు.. వారి పెర్ఫామెన్స్ మెరుగ్గా ఉంచుకోవాలంటే ఎప్పటికప్పుడు కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి హెల్దీ పుడ్స్ తీసుకోవాలి. ఇవి వారి ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతున్నారు నిపుణులు. బీట్‌రూట్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం చాలా మంచిది. మంచి బ్రైట్‌గా కనిపించే ఈ రెడ్ కలర్ రూట్ వెజిటేబుల్ అథ్లెట్స్‌కి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఆటలు ఆడేందుకు మంచి బలాన్నిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఏరోబిక్స్ పనితీరుని మెరుగుపరిచి ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
కొంతమంది బీట్‌రూట్‌ని జ్యూస్‌లా తీసుకుంటారు. మరికొందరు మామూలుగా అలానే తీసుకుంటారు. వీటిని ఎలా తీసుకున్నా వాటిలోని గొప్ప గుణాలు ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. కొన్ని పరిశోధనల్లో దీనిని తీసుకునే అథ్లెట్లు మెరుగైన పనితీరుని చూపించారని తేలిది.