ముంబై డివిజన్‌లోని నహుర్-ములుంద్ సెక్షన్ మధ్య గర్డర్‌లను ప్రారంభించడం కోసం ట్రాఫిక్ పవర్ బ్లాక్ కారణంగా, రైళ్లు మళ్లించిన మార్గంలో నడుస్తాయని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ. కె. త్రిపాఠి గురువారం ఒక ప్రకటన ద్వార తెలియజేసారు.
రైలు నం. 18519 విశాఖపట్నం-లోకమంత తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ 24న విశాఖపట్నం నుండి కర్జాత్-పన్వేల్ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుందన్నారు. అలాగే రైలు నెం. 11020 భువనేశ్వర్-సి ఎస్ ఎం టి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ నుండి బయలుదేరుతుందని 24 న థానేలో షార్ట్ టెర్మినేట్ చేయబడుతుందన్నారు. దింతో ఈ రైలు థానే మరియు సి ఎస్ ఎం టి మధ్య రద్దు చేసినట్లు వెళ్లడించారు.
రైలు సేవలు పునరుర్ధారణ
సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ఖరగ్‌పూర్ డివిజన్‌లో భద్రత సంబంధిత ఆధునీకరణ పనుల కారణంగా రద్దు చేయడానికి ఇంతవరకు ప్రతిపాదించబడిన రైళ్లు పునరుద్ధరించబడ్డాయని అందులో బాగంగా 28న రద్దుకు ప్రతిపాదించబడిన రైలు నం. 12863 హౌరా-ఎస్ ఎం వి బెంగళూరు రైలు పునరుద్ధరించబడిందని అదేవిదంగా 26న రద్దుకు ప్రతిపాదించబడిన రైలు నం. 12864 ఎస్ ఎం వి బెంగళూరు-హౌరా పునరుద్ధరించబడి ఆ రోజు 1 గంట ఆలస్యంగా నడపడానికి రీషెడ్యూల్ చేయడం జరిగిందని తెలిపారు.