వేసవి వచ్చేస్తోంది. ఈ సమయంలో శీతాకాలం తిన్న ఆహారాలు ఇప్పుడు తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. శరీరం వెచ్చదనం కోసం శీతాకాలంలో తాగే టీ, కాఫీలను వెంటనే బంద్ చేసి తర్భూజ, ఖర్భూజ లాంటి చల్లని జ్యూస్ తీసుకోవడం మేలు. లేదంటే అసిటిటీ సమస్యలు వంటివి ఏర్పడతాయి. అలాగే ఆయిల్ ఫుడ్స్, అల్లం, ఉల్లి వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.