హిందూపురం, పట్టణ పరిధిలోని కొట్నూరు సమీపంలో వివాహిత వడ్డె లక్ష్మీదేవి (43) గురువారం చెట్టుకు ఉరేసుకుంది. వనటౌన హెడ్‌కానిస్టేబుల్ హరి తెలిపిన వివరాలివి. శేషాపురానికి చెందిన వడ్డె వెంకటరామప్పకు చెన్నెకొత్తపల్లికి చెంది న వడ్డె లక్ష్మీదేవితో ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు ప్రస్తుతం ముద్దిరెడ్డిపల్లిలోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్నారు. కుమారుడు సంతానం. లక్ష్మీదేవి కొంతకాలం గా మతిస్థిమితం లేక అనారోగ్యంతో బాధపడుతుండేది. ఈక్రమంలో మ ధ్యాహ్నం కొట్నూరు సమీప అక్కమ్మ ఆలయం వద్ద చీరతో చెట్టుకు ఉరేసుకుంది. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.