వచ్చే ఎన్నికల్లో ధర్మవరం, రాప్తాడు ని యోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి, ఆయా ఎమ్మెల్యేలకు గట్టిగా బుద్ధి చెబుదామని టీడీపీ నియోజకవర్గం ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఆయన గురువారం మండలంలోని సంజీవపురం, బత్తలపల్లి, మాల్యవంతం, ముష్టూరు, అప్రాచెరువు, గంటాపురం గ్రామా ల్లో పర్యటించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో టీడీపీనాయకులు, కా ర్యకర్తలతో సమావేశమాయ్యరు. ఈ సందర్భంగా పరిటాలశ్రీరామ్ మా ట్లాడుతూ... 2019ఎన్నికల తర్వాత అధికారపార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలు, నాయకులు పార్టీని వీడకపోవడం గర్వంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ అభ్యర్థులు కూడా నిలబడలేని పరిస్థితిని అధికారపార్టీ సృష్టించిందన్నారు. అలాంటి సమయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనకు భాద్యతలు అప్పజెప్పారన్నారు. అప్పటికే రాప్తాడులో పనిచేస్తున్న తనపై ఇంత బాధ్యతలను ఎంతో నమ్మకంతో అప్పజెప్పారన్నారు. ఆ రోజుల్లో పరిటాలరవి కూడా కష్ట సమయంలో ఇక్కడ కార్యకర్తలకు అండగా నిలిచారని అన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇక్కడ కొందరు నాయకులు వందలకోట్లు పెట్టి పార్టీలోకి వస్తామని చెప్పుకుంటున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇటు ధర్మవరం, అటు రాప్తాడులో టీడీపీ జెండాను ఎగురవేస్తామని పరిటాలశ్రీరామ్ ధీమా వ్యక్తం చేశారు.