రాష్ట్రంలో టీడీపీ అధికారంలోనికి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. గుర్రపుసాల గ్రామంలో గురువారం సాయంత్రం ‘ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో అభివృద్ధి, ఉద్యోగల కల్పన, పెట్టుబడులు తీసుకొచ్చి నాడు చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడన్నారు. యువత ఉద్యోగల కోసం సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకొచ్చారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. టీడీపీ నాయకులపై దాడులు చేసి కేసులు పెట్టడం మినహా చేసిందేమీ లేదన్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా దాహం కేకలు వినబడుతున్నాయన్నారు. గుర్రపుసాల గ్రామప్రజలు తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎరిక్షన్‌బాబుకు విన్నవించారు.. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బయ్య, మాజీ సర్పంచులు కంచర్ల సత్యనారాయణగౌడ్, చెవుల అంజయ్య, ముండ్ల దానియేలు, కాశీకుండతాండ సర్పంచి ఎం మంత్రునాయక్, టీడీపీ నాయకులు చిట్యాల వెంగళరెడ్డి, పాలడుగు వెంకటకోటయ్య, గుండారపు వెంకట్రావు, మెడబలిమి అచ్యుతరావు, దొడ్డా శేషాద్రి, ఎం దేవయ్య,శింగారపు చెన్నయ్య, కొత్త భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.