లారీని వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కంటైనర్‌లో ఉన్న డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఒంగోలు త్రోవగుంట ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలలోకి వెళితే.. కృష్ణపట్నం నుంచి పెన్నా సిమెంట్‌కు బొగ్గులోడుతో లారీ వెళుతుంది. దాని వెనక చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెన్నెల ఫ్లేవర్ లోడ్‌తో కంటైనర్ వెళుతూ త్రోవగుంట సమీపంలో ముందున్న లారీని ఢీ కొట్టింది. దీంతో కంటైనర్ ముందు భాగం లారీలోకి దూసుకుపోయింది. ఈక్రమంలో తమిళనాడుకు చెందిన డ్రైవర్ భూతల క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న ఒంగోలు తాలుకా పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటనా స్థ లానికి చే రుకుని క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను జాగ్రత్తగా బయటకు తీశారు. గాయాలు కావడతో రిమ్స్‌కు తరలించారు. తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.