విశాఖపట్నం నగరంలోని సీతమ్మధార లిటిల్ గిగేల్ ప్లే స్కూల్ ఘటనపై డీఈఓ చంద్రకళ సీరియస్ అయ్యారు. స్కూల్ గుర్తింపు లేకుండా నడిపినందుకు లక్ష జరిమానా విధించారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (అర్బన్), ఉప విద్యాశాఖ అధికారి నివేదిక ప్రకారం విద్యాశాఖ చట్టం 2009 ప్రకారం స్కూలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. చైల్డ్ యాక్ట్ ప్రకారం ఈ ఘటనకు కారణమైన టీచర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇలాంటి గుర్తింపు లేని పాఠశాలలను మూసి వేయడానికి చర్యలు తీసుకుంటామని చంద్రకళ తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు.