శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల ఎం. ఎల్. సి ఎన్నికకు సంబంధించి మోడల్ కోడ్ అమలును పర్యవేక్షించడానికి జిల్లాలో మండలానికో ఫ్లైయింగ్ స్క్వాడ్ ను నియమించినట్లు జిల్లాఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మండలంలో మోడల్ కోడ్ అమలును పర్యవేక్షించడానికి హెచ్. డి. టి ఆధ్వర్యంలో ఈ. ఓ. పి. ఆర్. డి, పోలీస్ కాన్స్ టేబుల్ , వీడియో గ్రాఫర్ తో కూడిన కమిటిలను నియమించినట్లు తెలిపారు. అదే విధంగా ప్రతి మండలంలో ఈ. ఓ. పి. ఆర్. డిలు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు.
ఈ బృందాలు అన్ని గ్రామాలను, వార్డ్ లలోను సందర్శించి క్షేత్ర స్థాయి సమావేశాలు నిర్వహించి మోడల్ కోడ్ అమలు పై తగు సూచనలను అందించాలన్నారు. ఫ్లెక్షిలు, బ్యానర్లు , బోఅర్డ్స్ , వాల్ పెయింటింగ్స్ , గోడలపై రాతలను సంబంధిత పార్టీలు, భవనM యజమానులు తొలగించాలని, లేని యెడల నోటీసులు జరీ చేయాలనీ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ మోడల్ కోడ్ వెంటనే అమలులోకి వస్తుందని తెలిపారు.