అభివృద్ధి, సంక్షేమం తెదేపా తోనే సాధ్యమని తెదేపా తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపప్పూరు మండలంలోని కొట్టాలపల్లి గ్రామంలో గురువారం పర్యటించారు. ఇంటింటా తిరుగుతూ ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటూ సమస్యలపై ఆరా తీశారు. వైకాపా ప్రభుత్వ తీరుపై యువకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు లోకనాథరెడ్డి, తెదేపా మండల కన్వీనర్ రఘు, నాయకులు విశ్వనాథ, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.