లా నేస్తం పథకం కింద జూనియర్ న్యాయవాదులకు నగదును బదిలీ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ప్రభుత్వ న్యాయవాది, అడ్వకేట్ గడ్డ గుర్రప్ప శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు.
ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్లేటివ్ కౌన్సిల్ కు పట్టభద్రుల, ఉపాధ్యాయుల మరియు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో. రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ను అమలులోకి తెచ్చినా కూడా కోడ్ ను లెక్కచేయకుండా పట్టభద్రుల ఓట్లు రాబట్టుకునేందుకు లా నేస్తం పథకం కింద జూనియర్ న్యాయవాదులకు నగదును బదిలీ చేయటం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడం ఒక రాజ్యాంగ విరుద్ధమైన పని అని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా న్యాయవాదులపై అంత ప్రేమే ఉంటే నెలకు 20 వేల రూపాయలు జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం కింద అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. జూనియర్ న్యాయవాదుల అప్పుడే నిజమైన ప్రోత్సాహకం అందుకుంది అని అన్నారు. అది కూడా ఎన్నికల కూడా ఉన్నప్పుడు కాకుండా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సాధారణ సమయాలలో అందజేయాలని అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ను యదేచ్చగా ఉల్లంఘిస్తుంటే ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు గాను తీసుకునే చర్యలలో వైయస్సార్సీపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రలోభాలకు పట్టభద్రులు లొంగిపోరని, ఈ సోషల్ మీడియా యుగంలో ఎవరు నిజమైన ప్రజాసంక్షేమంతో పరిపాలన అందించారో, అందిస్తున్నాతో పట్టభద్రులకు తెలుసునని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.