వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఇటీవల నూతనంగా నియమించబడిన రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వంగర, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, రాజాం టౌన్, రాజాం రూరల్ మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్లు, కో-కన్వీనర్లు శుక్రవారం రాజాం పట్టణంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి విచ్చేసి ఎమ్మెల్యే కంబాల జోగులు ని కలిశారు. జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వై. వాసు నాయుడు అధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా కన్వీనర్లు, కో కన్వీనర్లు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మమ్మలను గుర్తించి పదవులను కేటాయించడం చాలా సంతోషంగా ఉందని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంబాల మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు తెలిసేలా, ప్రతిపక్షాల కుట్రలను, పలు మీడియా ఛానళ్ల అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.