ఉత్తరాంధ్ర క్రీడాకారులకు ఓ సువర్ణ అవకాశం దక్కింది. టీమిండియా మాజీ క్రికెట్ ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ ప్రారంభమైంది. ఆనందపురం మండలం తాళ్లవలసలో ఇటర్నేషనల్ క్రికెట్ అకాడమీని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెస్కే ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం గోకరాజు గంగరాజు, ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ ఆడి సందడి చేశారు. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో క్రికెట్ లో శిక్షణకు శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో క్రికెట్‌పై ఇంట్రెస్ట్ ఉన్నవారు శిక్షణ తీసుకునేందుకు మంచి అవకాశం దక్కిందని చెప్పాలి.
జిల్లా, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లపై ఒత్తిడి ఉంటుందని.. కొంత వరకే వారు చేయగలరన్నారు. ఇలా ప్రైవేట్ అకాడమీలు వచ్చి జిల్లా, రాష్ట్ర అసోసియేషన్‌లకు మద్దతుగా నిలుస్తాయన్నారు. ఇలా అకాడమీల ద్వారా మంచి, మంచి క్రికెటర్లు వస్తారన్నారు. అత్యున్నత సౌకర్యాలు ఏర్పాటు చేశామని.. కేఎస్ భరత్, షబ్నంలు ఇదే ప్రాంతం నుంచి టీమిండియాకు ఆడుతున్నారన్నారు. టెస్ట్ క్రికెట్ అంటే ఎందుకొచ్చిన రిస్క్ అనుకుంటున్నారన్నారు. ఉమెన్ అకాడమీ రన్ చేయడం కష్టమన్నారు. టీమిండియాకు ఆడటం, చీఫ్ సెలక్టర్‌గా పనిచేసిన వ్యక్తి అకాడమీ ప్రారంభించండ శుభపరిణామం అన్నారు గంగరాజు.