ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగాల వయో పరిమితి ఐదేళ్ల ఏళ్లకు పెంచుతూ ఏపీ ఉత్తర్వులు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 12:49 PM

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వయో పరిమితి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  సీఎస్ జవహర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డబ్ల్యు ఎస్ వర్గాలకు 5 ఏళ్ళు వయోపరిమితి ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం 34 ఏళ్ళు ఉన్న వయోపరిమితి 39 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఈ డబ్ల్యు ఎస్ వర్గాలు మేలు పొందనున్నాయి.


మరోవైపు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలు, విశేషాలతో టేబుల్‌ గైడ్‌ పుస్తకాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. ఇంగ్లీష్, జర్మనీ, స్పానిష్‌, చైనీస్‌ భాషల్లో ఈ పుస్తకాలను అందుబాబాటులోకి తెచ్చారు. వచ్చే నెల 3, 4న విశాఖలో నిర్వహించనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు హాజరయ్యే విదేశీ ప్రతినిధుల కోసం వీటిని తీసుకొచ్చారు. ఎయిర్‌‌పోర్ట్ లాంజ్‌లు, రాయబార కార్యాలయాల్లో, పర్యాటక కేంద్రాల్లో అందబాటులో ఉంచుతారు.


ఇటు ఈ నెల 27, 28 రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల సైన్సు ఫెయిర్‌ను విజయవాడలో నిర్వహించనున్నారు. ఆంధ్ర లయోలా కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాకు 10 చొప్పున మొత్తం 260 ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచుతారు. ఐదు థీమ్‌లపై ఒక్కో థీమ్‌కు రెండేసి చొప్పున జిల్లాల నుంచి ప్రాజెక్టులు రానుండగా.. ప్రతి థీమ్‌లో ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులు ఇస్తారు.


అలాగే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జీతంతోపాటు న్యూస్ పేపర్ల కోసం మరో రూ.200 చొప్పున ప్రత్యేక భత్యం చెల్లించేందుకు సచివాలయాల్లో ప్రత్యేక ఖాతాలను ఓపెన్ చేశారు. ఇకనుంచి ఇదే ఖాతాల నుంచి నిధులు డ్రా చేసి చెల్లించాలని అధికారులకు సచివాలయాల శాఖ సూచించారు. పేపర్ల కోసం ఏ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేయాలన్న విషయంలో అధికారులు సందేహాలు వ్యక్తం చేయడంతో ఆర్థిక శాఖకు సచివాలయాలశాఖ ఇటీవల లేఖ రాసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com