తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు కొంత మంది సీబీఐని ప్రభావితం చేశారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారిని పోలీసులు కొట్టారన్నది నిజమన్నారు రఘురామ కృష్ణరాజు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తప్పుడు నివేదికను ఇచ్చారని ఆరోపించారు. గతంలో తనను చిత్రహింసలకు గురి చేసినప్పుడు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ తప్పుడు నివేదికను ఇచ్చారని గుర్తు చేశారు. అని మిలిటరీ ఆసుపత్రి వైద్యుల రిపోర్టు గురించి అందరికీ తెలిసిందే అన్నారు. పట్టాభిని పోలీసులు కొట్టడం వల్లే ఆయన చేయి వాచిందని.. అయితే పట్టాభి ఫైల్ ఫోటోను వాడుకుని వార్త పత్రికలో ప్రచురించగా.. ఆ తర్వాత అది ఫైల్ ఫోటో అని వివరణ ఇచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు కొంత మంది సీబీఐని ప్రభావితం చేశారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి ఇప్పటికే రిటైర్డ్ అయ్యారన్నారు. సీబీఐని ప్రభావితం చేస్తుంది సీఎం రమేశ్ అనడం దారుణమన్నారు.
తమ పార్టీ అధ్యక్ష పదవికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు రఘురామకృష్ణ రాజు. తమ పార్టీ శాశ్వత జీవితకాల అధ్యక్షుడి పదవికి మాత్రమే గతంలో ఎన్నికలు నిర్వహించారని.. అయితే ఆ ఎన్నిక చెల్లదన్నారు. ఇదే విషయమై తాను గత ఏడాది కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిపారు. శాశ్వత జీవితకాల అధ్యక్షుడు ఎన్నిక అనేది పార్టీ రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. అలాగే పార్టీ పేరును మార్చడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ పేరిట 55 ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని.. ఇప్పుడు తమ పార్టీ పేరు వైఎస్సార్‌గా మార్చడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వైఎస్సార్ పేరుతో పార్టీని ఏర్పాటు చేసినప్పుడు, అదే పేరుతో సంక్షేమ పథకాల అమలు చేయడం కుదురుతుందా అని ప్రశ్నించారు.
పార్టీ శాశ్వత జీవితకాల అధ్యక్షుడు జగన్ చెల్లదని ఎన్నికల కమిషన్ ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికైనట్లు తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై వివరణ ఇవ్వాలని పలుమార్లు తమ పార్టీ నాయకత్వానికి ఈసీ లేఖలు రాసిందని తెలిపారు. జీవితకాల శాశ్వత అధ్యక్షుడిని అనుమతిస్తే ప్రాంతీయ పార్టీలన్నీ అంటూ వ్యాధి లాగా ఈ విధానాన్ని ఆచరిస్తారని ఎన్నికల సంఘం పేర్కొందన్నారు. తాను ఎన్నికల సంఘానికి తమ పార్టీ పేరు ఏమిటో తెలియజేయాలని త్వరలో లేఖ రాయనున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలకు యాజమాన్యపు హక్కులు ఉండవన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మారిస్తే నిధులను నిలిపివేస్తామని కేంద్ర మంత్రి హెచ్చరించారని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల పేర్లను రాష్ట్రంలో పేర్లు మార్చి అమలు చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం లక్షన్నర రూపాయలు లబ్ధిదారులకు అందజేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి జగనన్న కాలనీలని పేరు పెట్టిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పేరును వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ పేరిట, పోషన్ అభియాన్ ను జగనన్న గోరు ముద్ద పేరిట అమలు చేస్తున్నారన్నారు.
గ్రామపంచాయతీలకు ఉన్న బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు తమ పార్టీకి ఓటు వేయవద్దని రఘురామకృష్ణ రాజు కోరారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధానమంత్రి హాజరైనప్పుడు తన అనుచరులతో అవరోధాలు కల్పించినట్లుగా ఎవరో ఫిర్యాదు చేస్తే, తనపై కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా అర్నేష్ కుమార్ ఆర్డర్ ను అనుసరించాలని న్యాయమూర్తి ఆదేశించారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa