ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఐదు టిప్స్ పాటిస్తే మాత్రం,,,మీ యూపీఐ సురక్షితం

national |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 08:16 PM

యూపీఐ పేమెంట్స్ చేయడం ఎంత సులువో కాస్త ఎమరపాటుకు గురైతే వాటి వల్ల అంతే నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఇదిలావుంటే యూపీఐ ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ అనేది చాలా పాపులర్‌గా మారింది. అదే క్రమంలో సైబర్ క్రైమ్స్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్లు యూపీఐ పేమెంట్స్ ద్వారా చాలా మందిని ఈజీగా మోసం చేస్తున్నారు. వారి మాటలను నమ్మి చాలా మంది తమ డబ్బులను కోల్పోతున్నారు. ఈ సమయంలో యూపీఐ పేమెంట్స్ ద్వారా చేసే ఆన్‌లైన్ పేమెంట్స్ చేసే టప్పుడు సురక్షితంగా ఏ విధంగా చేయాలి? ఈ ఐదు టిప్స్ పాటింటి మీ డబ్బులను సురక్షితంగా ఎదుటివారికి పంపించండి. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


స్ట్రాంగ్ స్కీన్ లాక్, పాస్‌వర్డ్, పిన్ అనేది కేవంల మీ ఫోన్ భద్రంగా ఉండడంలో కీలక పాత్ర పోషించదు.. మీ పేమెంట్లు, ఆర్థిక లావాదేవీలు సురక్షితంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఇది మీ సున్నితమైన సమాచారం, వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించకుండా ఉపయోగపడుతుంది. మరోవైపు.. ఈజీగా తెలిసిపోయేలా పాస్‌వర్డ్స్ పెట్టుకోవద్దు. మీ పేరు, జన్మదినం మొబైల్ నంబర్ వంటివి పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు.


మీ వ్యక్తిగత పిన్ నంబర్‌ను ఎవరితోనూ పంచుకోవచ్చు. దాని ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు మీ ఫోన్ హ్యాక్ చేసి మీ విలువైన సమచారాన్ని, ఆర్థిక విషయాలను బహిర్గతం చేసే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడి నష్ట పోయే ప్రమాదం ఉంది. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు వెంటనే మీ పిన్ నంబర్ మార్చుకోవడం ద్వారా సైబర్ నేరగాళ్ల బారి నుంచి తప్పించుకోవచ్చు.


ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న సైబర్ నేరాల్లో గుర్తు తెలియని లింక్స్‌ను క్లిక్ చేయడం ద్వారానే జరుగుతున్నాయి. ఇలా ఫోన్‌కు వచ్చిన లింకులను క్లిక్ చేయొద్దు. మీ పిన్ వంటి డేటాను తెలుసుకునేందుకు సైబర్ నేరగాళ్లు బ్యాంకుల నుంచి ఫోన్ చేసినట్లు మాట్లాడతారు లేదా ఫోన్‌కి లింకులు పంపించి క్లిక్ చేయాలని కోరుతుంటారు. ఇలాంటి వాటి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే.. వెరిఫికేషన్ కోసం థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరినప్పుడు వాటికి దూరంగా ఉండాలి. అలాంటి వివరాలను బ్యాంకులు ఎప్పుడు ఫోన్ ద్వారా అడగవని గుర్తుంచుకోవాలి. కొత్త నంబర్ల ద్వారా వచ్చే లింకులపై క్లిక్ చేయొద్దు.


యూపీఐ యాప్స్ తరుచుగా అప్డేట్ చేసుకోవాలి..


యూపీఐ పేమెంట్స్ యాప్స్ ఉపయోగిస్తున్నవారు తరుచుగా ఆయా యాప్స్‌ని అప్డేట్ చేస్తుండాలి. లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేసుకోవడం ద్వారా కొత్త ఫీచర్లు బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ యాప్ స్టోర్ ద్వారా డౌన్‍‌లోడ్ చేసుకోవాలి.


బహుళ పేమెంట్స్ అప్లికేషన్ వాడటం మానుకోవాలి..


మీ ఆన్‌లైన్ పేమెంట్స్ సురక్షితంగా ఉంచుకునేందుకు నమ్మకమైన, వెరిఫైడ్ పేమెంట్స్ అప్లికేషన్లను మాత్రమే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఫ్రాడ్స్ నుంచి తప్పించుకునేందుకు బహుళ పేమెంట్స్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోకపోవడం మంచిది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com