జార్ఖండ్ లోని బొకారో జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ వ్యాప్తిచెందింది. దీంతో కోళ్లు, బాతులతో సహా దాదాపు 4 వేల పక్షులను చంపాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే చనిపోయిన కోళ్లలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ రకానికి చెందిన హెచ్5ఎన్1 ఉన్నట్లు గుర్తించారు. లోహంచల్ లోని ఫామ్‌లో 800 కడక్ నాథ్ కోళ్లు చనిపోయాయని తెలిపారు.