యావత్ భారతదేశంలోనేప్రసిద్ధిగాంచిన కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శంకర విజయేంద్ర మహా సరస్వతి స్వామీజీ ఈ నెల28 వ తేదీ మంగళవారం అనకాపల్లి పట్టణానికి విచ్చేయనున్నారు. ఆరోజు సాయంత్రం 5గంటల నుండి పట్టణంలోని సుంకరమెట్ట జంక్షన్ నుండి మెయిన్ రోడ్డు లో గల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు శోభాయాత్ర జరగనుంది. మార్చి 1, 2 తేదీల్లో స్వామీజీ పర్యవేక్షణలో త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. అలాగే స్వామీజీకిబిక్షావoధనం , పాద పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. 1 వ తేదీన సాయంత్రం స్టీల్ ప్లాంట్ సంగీత శిక్షకులు పి. దుర్గారావు బృందం చే సుందరకాండ పారాయణ, ఆదిశంకరాచార్యుల స్తోత్ర పారాయణం జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు