రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల అపరిష్కృత సమస్యలపై ఉద్యమ కార్యాచరణకు ఏపీ జేఏసీ అమరావతి శ్రీకారం చుట్టింది. ఆదివారం ఏపీ రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి 26 జిల్లాల జేఏసీ అనుబంధ సంఘాల ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులు, పెన్షనర్ల అపరిష్కృత సమస్యలపై చర్చిస్తారు.