అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం సమీపంలో మన్నూరు బైపాస్ రోడ్డు వద్ద చిన్నపిల్లల గెలాక్సీ గేమింగ్ షాపును ఆదివారం రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి మరియు జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అక్కడి వసతులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు ఆటలు ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట రాజంపేట పట్టణ సచివాలయ కన్వీనర్ల ఇంచార్జ్ వడ్డే రమణ , గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ హస్తవరం ఉమామహేశ్వర్ రెడ్డి , రామ్మోహన్ నాయుడు, దాసరి పెంచలయ్య , వైసిపి మహిళా నాయకురాలు మిరియాల సురేఖ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa