ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని నాలుగవ వార్డులో ఆదివారం ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని స్థానిక టిడిపి నాయకులు నిర్వహించారు. టిడిపి ఇన్చార్జ్ అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పెరిగిన ధరలతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. 2024 ఎన్నికలలో టిడిపి తప్పక గెలుస్తుందని మళ్లీ పేదలకు మంచి రోజులు వస్తుందని టిడిపి నాయకులు అన్నారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.