పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కాశీబుగ్గ శ్రీ కన్యకాపరమేశ్వరి వైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన కొట్ని దుర్గాప్రసాద్ కు రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షునిగా ఎంపికైన అనంతరము మంత్రి ని మర్యాద పూర్వకంగా కలుసుకోవడం తో, మంత్రి ఆయన్ను అభినందించారు. అనంతరం మంత్రి తన అనుచరులతో కలసి సత్కరించారు.