కాలేజ్ లో చదువుకుంటున్న అమ్మాయి ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తోంది. తల్లిదండ్రులు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. ఎంతో ఫేమస్ కాలేజ్ లో చదువుకుంటున్న కూతురు ఉన్నత చదువులు చదివి మాకంటే గొప్పగా జీవిస్తుందని తల్లిదండ్రులు అనుకున్నారు. మద్యాహ్నం కాలేజ్ అమ్మాయి బయటకు వెళ్లిపోయింది. సాయంత్రం తల్లికి ఫోన్ చేసి నేను ఆలస్యంగా ఇంటికి వస్తానని చెప్పింది. తరువాత 10వ అంతస్తు మీదకు వెళ్లిన కాలేజ్ అమ్మాయి అక్కడి నుంచి దూకేసింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కారు మీద పడిన కాలేజ్ అమ్మాయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.