జమాఅతే ఇస్లామి హింద్ స్థాపించి 75 ఏళ్ళు అయిన సందర్బంగా ఆదివారం ప్రొద్దుటూరు స్థానిక ఇంటర్ నేషనల్ ఫంక్షన్ హాల్ నందు ఆధ్యాత్మిక సభ నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జనాబ్ మహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ జమాఅతే ఇస్లామి హింద్ సంఘ సేవలను విశ్రుతం చేస్తున్నామని తెలిపారు. సంస్థ చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను వివరించారు. తమ సంస్థ దివ్య ఖురాన్ ను 19 భాషల్లో అనువదించి ముద్రించినట్లు తెలిపారు. అనంతరం జమాఅతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్సును జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జమాఅతె ఇస్లామిహింద్ కేంద్ర సలహామండలి సభ్యులు మౌలాన ఎజాజ్ అస్లం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీముద్దీన్, మౌలాన గౌస్ మొహీద్దీన్, యన్. యస్. మొహిద్దీన్, హుస్సేన్ అహ్మద్, పట్టణాఅధ్యక్షుడు షరీఫ్, ఖాజీ ఇనాయతుల్లా, ఇమాంలు మౌలానా అబుసాలెహ రషాది, మహబూబ్ బాష, జనాబ్ షా, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఖాజీ సయ్యద్ హబీబుల్లా, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.