లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో ఆదివారం పులివెందుల వైఎస్ఆర్సిపి ఇన్చార్జి వైయస్ భాస్కర్ రెడ్డి స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో మాలే గంగమ్మ , పోలేరమ్మ ఆలయ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. లింగాల కేంద్రంలో పాడా నిధులతో నిర్మించిన స్మశాన వాటిక, ప్రహరీ గోడలను, అలాగే జడలయ్య మఠం వద్ద నిర్వహించిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. స్థానిక పాఠశాల విద్యార్థులు విజ్ఞప్తి మేరకు జడలయ్య మఠం ఆవరణంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.