కాజీపేట పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థి ఆదివారం ఈతకు వెళ్లి బావిలో మృతి చెందడం బాధాకరమని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఎంఈ ఎఫ్ నాయకులు పేర్కొన్నారు. ఎంఎస్పి జిల్లా నాయకులు జయరామ్ మాదిగ, ఎం ఈ ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈరి. జ్వానేస్, జిల్లా నాయకులు గంగరాజు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు మహేష్ మాదిగ లు విషయం తెలియగానే ఆదివారం రాత్రి వారు హాస్టల్ ను సందర్శించి, పరిసరాలను పరిశీలించి హాస్టల్ అధికారులతో, విద్యార్థులతో మాట్లాడి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.