వేంపల్లె పట్టణానికి చెందిన సంతోష్ కుమార్ కు చెందిన షిఫ్ట్ డిజైర్ కారు ను సోమవారం తెల్లారు జామున గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గత రెండు నెలలుగా వేంపల్లె లో ఇదే తంతు జరుగుతుందని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఇప్పటివరకు మూడు కార్లు, ఆరు బైకులకు అగంతకుడు నిప్పు పెట్టారన్నారు. కారుకు నిప్పు పెట్టే దృశ్యాలు ఎట్టకేలకు సీసీ కెమెరాలకు చిక్కాయి. అగంతకుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అగంతకుడు వేంపల్లి వాసిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగంతకుడు సీసీ కెమెరాల కు చికడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను ద్వారా పోలీసులు పరిశీలిస్తున్నారు.