సమాజ సేవలో మానవతా స్వచ్చంద సంస్థ లక్ష్య సాధనకు ప్రతి సభ్యుడు శక్తివం చన లేకుండా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విశ్రాంత ఉపాధ్యాయులు మునిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం జమ్మలమడుగు పట్టణంలోని స్థానిక గౌతమ్ ప్రైవేటు పాఠశాల ఆవరణలో జిల్లెల్ల చెన్నకేశవరెడ్డి అధ్యక్షతన మానవత. సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్యులు నైతిక విలువలు పాటిస్తూ సమాజం ద్వారా మంచి గుర్తింపు పొందాలని సూచించారు. అనంతరం నిమోనియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి రేవంత్రెడ్డి వైద్య ఖర్చుల నిమిత్తం మానవతా ప్రతినిధుల సహకారంతో రూ. 34వేలు అందజేశారు. చిన్నారి ఆరోగ్యం మెరుగై త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కల్లూరు గంగాధర్రెడ్డి, కోశాధికారి జీరెడ్డి మల్లికార్జునరెడ్డితో పాటు సాంబశివారెడ్డి, ఎస్. నాగార్జునరెడ్డి, మధుసూదన్రెడ్డి, విజయకుమార్రెడ్డి, రాజవర్ధన్రెడ్డి, రామ్మోహన్, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.