ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి కాకాణి ఊరిలో ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2023, 01:43 PM

నెల్లూరు జిల్లాలో  మంత్రి కాకాణి సొంతూరైన పొదలకూరు మండలం తోడేరు పంచాయతీ శాంతినగర్ చెరువులో ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే...  తోడేరుకి చెందిన 10 మంది యువకులు సరదాగా చెరువులోకి వెళ్లారు. కాగా వీరు వెళ్లిన తెప్ప చెరువులో ప్రమాదవశాత్తు తిరగబడింది. ఈ ఘటనలో ఆరుగురు గల్లంతవగా...నలుగురు యువకులు క్షేమంగా ఒడ్డుకు తిరిగి వచ్చారు. గల్లంతైన ఆరుగురి ఆచూకీ కోసం రాత్రి నుంచి పోలీసులు, గజ ఈతగాళ్ళు, రిస్క్యూ టీం ముమ్మరంగా గాలిస్తున్నారు. కేరళ రాష్ట్రంలో అధికారిక పర్యటనలో ఉన్న మంత్రి కాకాణి విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సొంతూరుకు చేరుకున్నారు. ఎస్పీ విజయరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చెరువులో గల్లంతైన వారిలో పముజుల బాలాజీ (21), పాటి సురేంద్ర(18), మన్నూరు కళ్యాణ్(25), బట్టా రఘు(24), అల్లి శ్రీనాధ్(18), చల్లా ప్రశాంత్(28)గా గుర్తించారు. ఇప్పటి వరకు కళ్యాణ్, ప్రశాంత్ అనే ఇద్దరి యువకుల మృతదేహాలను వెలికితీశారు. మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com