రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ మధుసూదన్ ఎన్నికల బరిలో నిలిచారు. గుట్టపాడు మోహన్ రెడ్డి, భూమా వెంకట వేణుగోపాల్ రెడ్డి అనే సర్పంచులు ఇద్దరూ.. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. దీంతో ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు వైసీపీ నేతలు యత్నిస్తు్న్నారు. ఈ క్రమంలోనే సర్పంచులిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఏకగ్రీవం అవుతుందా లేక ఎన్నిక జరగనుందా? అని సర్వత్ర ఆసక్తి నెలకొంది.