ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 13న స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్నాయి.ప్రస్తుతం ఏపీలో ఏడుగురు, తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల.. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ.. మార్చి 14న నామినేషన్ల పరిశీలన.. మార్చి 23న పోలింగ్.. అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది.