ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. సోయా, పనీర్, బీన్స్, ఫిష్, చికెన్ వంటి ఆహారాలు తినాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసం ఒక పండును తినాలి. అవకాడో, పీనట్స్, నట్స్ లాంటివి కూడా తినడం మంచిదే. జీడిపప్పు, బాదం, వాల్ నట్స్ వంటి డ్రైఫ్రూట్స్ కూడా తినాలి. పెరుగు కూడా రోజూ తినాలి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.