వేసవిలో డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడాలంటే ఎక్కువ నీరు తాగాలి. అలా అని నీరు అతిగా తాగినా మంచిది కాదు. కాబట్టి శరీరానికి తగిన మోతాదులో నీరు అందించాలి. సాధారణ సమయంలో హైడ్రేటెడ్ గా ఉండటానికి రోజుకు కనీసం 2 నుంచి 2.5 లీటర్ల నీరు తాగాలి. అయితే వేసవి ఎండలను తట్టుకోవాలంటే 2.5 నుంచి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యల తలెత్తకుండా ఉంటాయని చెబుతున్నారు.