గుంటూరు నగర వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కనుమ అంజుమన్ కమిటి అధ్యక్షుడుగా ఉన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా వ్యాపార లావాదేవీలను కనుమ చూసుకుంటున్నారు. అధికార పార్టీ నేత ఇంట్లో ఐటీ సోదాలతో తీవ్ర కలకలం రేగుతోంది.