గుంతకల్లు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో ప్రపంచ ఎన్జీఓ దినోత్సవం సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు త్రిష్లా బాన్సాలి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలలోని వంద మంది విద్యా ర్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి ఐరన్ మాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా త్రిష్లా బాన్సాలి మాట్లా డుతూ విద్యార్థులు రక్తహీనత రాకుండా ఉండడానికి తప్పనిసరిగా ఆకుకూరలు, కూరగాయలు వంటి రక్త వృద్ధి ఆహారం తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రక్త వృద్ధి మాత్రల దాత సుప్రజ శెట్టి, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు వెల్చూరి రేణుక, ప్రిన్సిపల్ మోహన్, ఏఎన్ఎం నారాయణమ్మ, ఎంఎల్ హేచ్ పి హైమా, ఆశా వర్కర్లు విజయ లక్ష్మి, సాయిలత తదితరులు పాల్గొన్నారు.