నిరుద్యోగ యువతకు రుణాలు అందించే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ కార్పొరేషన్ల నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లించి వారినీ దగా చేసిందని గుంతకల్లు నియోజక వర్గం టిడిపి ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్. జితేంద్ర గౌడ్ ఆరోపించారు. సోమవారం గుంతకల్లు మండల పరిధిలోని మల్లేని పల్లి, దోనిముక్కల గ్రామాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులకు ఉపాధి కోసం రుణాలను అందించే కార్పొరేషన్ల నిధులను దారి మళ్లించి వారిని దగా చేసిందన్నారు. అనం తరం గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా మల్లెనిపల్లి గ్రామం సర్పంచ్ శ్రీరాములు ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పది కుటుంబాలు జితేంద్ర గౌడ్ సమక్షం లో టిడిపి పార్టీలోకి చేరారు.