గుంతకల్లు పట్టణంలోని అన్ని వార్డు లలో ఆస్తి పన్నుల వసూలు ప్రత్యేక కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది తోపాటు ఇంజనీరింగ్ నాన్ పిహెచ్ వర్కర్లు యూనిఫారం ధరించి పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నాన్ పి హెచ్ వర్కర్ల హాజరు పట్టికను ఆయన పరిశీలించారు. ఆస్తి పన్నుల వసూలు ప్రత్యేక కార్యక్రమంలో యూనిఫారం ధరించి సచివాలయం సిబ్బందితో పాటు పాల్గొనాలని ఆయన ఇంజనీరింగ్ నాన్ పిహెచ్ వర్కర్లను ఆదేశించారు.