తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో నేటి నుండి ప్రయోగాత్మకంగా కొత్త నిబంధనను ప్రవేశపెట్టనున్నారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ ల చెల్లింపులను చేపట్టనున్నారు. ఈ సాంకేతికత సాయంతో దళారులకు చెక్ పెట్టవచ్చని టీటీడీ భావిస్తోంది. ప్రయోగాత్మకంగా విజయవంతమైతే, పూర్తిస్థాయి అమలుపై టీటీడీ నిర్ణయం తీసుకోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa