ఈ ఏడాది వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో మే 31 వరకు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని హెచ్చరించింది. ఫిబ్రవరి నెలలో నమోదైన ఉష్ణోగ్రతల సగటు రికార్డ్ స్ఠాయిలో ఉందని తెలిపింది. 1901 తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతల నెల సగటు ఆ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారని పేర్కొంది. ఈ ఎండల తీవ్రత పంటలపై ప్రభావం చూపనుందని తెలిపింది.