త్రిపురలో గురువారం ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు పూర్తయ్యాయని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) గిత్తె కిరణ్‌కుమార్ దినకరరావు తెలిపారు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 16న ఎన్నికలు జరిగాయి, దాదాపు 89.98 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సుమారు ఐదు నుండి ఎనిమిది రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది. మధ్యాహ్నానికి ట్రెండ్‌లు స్పష్టంగా కనిపిస్తాయి అని ఎన్నికల అధికారి బుధవారం తెలిపారు. తొలిసారిగా లెఫ్ట్ ఫ్రంట్ తన బద్ధ ప్రత్యర్థి కాంగ్రెస్‌తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.