జగనన్న కాలనీ, టిడ్కో ఇళ్ల సమస్యపై నేడు విజయవాడలో సీపీఐ రాష్ట్ర సమితి తలపెట్టిన ధర్నాకు వెళ్ళకుడదని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావుకు చినకాకాని లోని ఆయన నివాస గృహానికి బుధవారం అర్థరాత్రి సమయంలో మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్బంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమస్యను తెలిపే హక్కు రాజ్యాంగo కల్పించిందని, ప్రజా సమస్యలపై శ్రద్ధపెట్టి సమస్యను పరిష్కరించాలి కానీ ఇలా ఉద్యమాలకు వెళ్లకుండా నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు.