దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జనాలు గాలి పీల్చుకునేందుకు జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరంలో గాలి నాణ్యత ఎన్నడూ లేనంత దారుణ స్థాయికి పడిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత తగ్గుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గత మూడు నెలలుగా గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతూనే ఉంది. శ్వాస సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య గత వారం రోజుల్లోనే రెట్టింపైంది.
నగరంలో ఇప్పుడు జనం జలుబు, తలనొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. మానవ ఆరోగ్యంపై ఈ సమస్యలు దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని డాక్టర్లు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం కరోనాతో తీవ్రంగా ఇబ్బందిపడిన నగరాల్లో ముంబై ఒకటి. ఆ తర్వాత ఈ స్థాయిలో జనం శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతుండటం ఇదే ప్రథమంగా చెప్తున్నారు.