రాబోయే పండుగల దృష్ట్యా యూపీలోని గౌతమ్ బుద్ధ్ నగర్‌లో పోలీసులు 144 సెక్షన్‌ను మార్చి 31 వరకు పొడిగించారు. హోలికా దహన్, హోలీ, నవరాత్రి, రామ నవమి వంటి పండుగల సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు, గౌతమ్ బుద్ధ నగర్ పరిపాలన ఫిబ్రవరి 28 వరకు 144 సెక్షన్ విధించింది. ఈ సమయంలో ఐదుగురికి మించి ఎక్కడా గుమిగూడరాదని, జిల్లాలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లా అండ్ ఆర్డర్ అదనపు డిప్యూటీ కమిషనర్ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa