పేద కుటుంబాలకు చెందిన విద్యా ర్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యాశాఖ అవకాశం కల్పించిందని డీఈవో మీనాక్షి గురువారం పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తర గతిలో ప్రవేశానికి సంబంధించి అర్హులైన పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. సీట్ల భర్తీకి సంబంధించి ఈనెల 4న నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, ఆ మేరకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈనెల 6 నుంచి 16వ తేదీ వరకు cse. ap. gov. in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అనంతరం ఈనెల 18 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు వెబ్సైట్లో మరోసారి నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు.