జిల్లావ్యాప్తంగా రబీ సీజన్లో వంద శాతం ఈ పంట నమోదు ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ బసంత్ కుమార్ గురువారం తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 95, 535 ఎకరాల్లో వరి, వేరుసెనగ, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలను రబీ సీజన్లో రైతులు సాగు చేశారన్నారు. ఈ పంటలన్నిటినీ గ్రామ వ్యవసాయ సహాయకులు ఇప్పటి వరకు వంద శాతం పూర్తిగా ఈ పంట నమోదు చేశారన్నారు. ఈ పంటలో నమోదైన పంటల వివ రాలను రైతులందరూ సరిచూసుకొని యాప్లో వేలిముద్ర వేసి ఈకేవైసీ చేయించుకుంటేనే ధాన్యం కొనుగోలు, పంటనష్ట పరిహారం పొందడానికి అర్హులవుతారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 96 శాతం మంది రైతులు ఈకేవైసీ చేయించుకున్నారని, మిగిలిన రైతులు ఈనెల 4వ తేదీలోపు పూర్తి చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి గడు వులోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు.